V1News Telangana

best news portal development company in india

పోలీస్ స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమం

SHARE:

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చర్యలు : పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య..

నిజామాబాద్, మార్చి 16
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం రోజున కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌లలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు కార్యాలయ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
కార్యక్రమంలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు, సర్కిల్ కార్యాలయ సిబ్బంది, ఏసీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోలీస్ శాఖ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india