V1News Telangana

best news portal development company in india

నేరాల నియంత్రణ కోసం కార్డెన్ సెర్చ్ అసాంఘిక కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పువు :సిఐ ప్రసాద్ రావు

SHARE:

నేరాల నియంత్రణ కోసం కార్డెన్ సెర్చ్ అసాంఘిక కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పువు :సిఐ ప్రసాద్ రావు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 25, రామగుండం :-

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో శనివారం కేకే నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్డెన్ సెర్చ్ కొనసాగింది.సీఐ ఆధ్వర్యంలో 30 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇళ్లను సోదా చేశారు.ఈ తనిఖీలో ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోలీసులు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరంసైబర్‌ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారి భద్రత కోసమే తాము కార్డెన్ సెర్చ్ పేరిట ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.కార్డెన్ సెర్చ్ తో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేరాల నియంత్రణ కొరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశామని తెలిపారు. నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలిపారు.ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనబడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 100కి ఫోన్ చేయాలని సూచించారు.కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐలు ప్రసాద్ రావు,లింగమూర్తి,కమాన్పూర్ ఎస్సైలు ప్రసాద్,రవళి,ఏఎస్ఐ కలిల్,హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణారెడ్డి,సంతోష్,30 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india