సాలంపాడ్ సొసైటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతల స్వీకరణ.. ఘనంగా సన్మానించిన రైతులు, ప్రజాప్రతినిధులు..
బోధన్, నవంబర్ 2: సాలూర మండలం సాలంపాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్‌పర్సన్‌గా నియమితులైన వీరంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సోమవారం సంఘ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, వివిధ సహకార సంఘాల చైర్మన్లు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్‌పర్సన్‌తో పాటు సంఘ పర్సన్‌లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వీరంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేస్తానని, సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
సహకార సంఘాల ద్వారా రైతులకు అందే సేవలు వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమని, రైతుల అవసరాలను గుర్తించి వారి అభ్యున్నతికి పాటుపడటం తన ప్రధాన లక్ష్యమని చైర్‌పర్సన్ తెలిపారు. రైతుల సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సాలూర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందర్న రవి, పలు సహకార సంఘాల చైర్మన్లు, మాజీ చైర్మన్లు, సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు, రిటైర్డ్ సీఈఓ బస్వంతరావు పటేల్, సంఘ సీఈఓ కార్ల శ్రీనివాస్, AMC డైరెక్టర్ ఆవుల బాలకృష్ణారెడ్డి.
సంఘ పర్సన్‌లు ఆవుల పద్మారెడ్డి, గైని పెద్ద గంగారం, శీలం భాస్కర్ రెడ్డి, మద్దినేని శ్రీనివాసరావు, కామిరెడ్డి రమణారెడ్డి, తూము వెంకటేశ్వర్ రెడ్డి, బేకరీ లక్ష్మీ, మేడం భారతీదేవి, చెరుకుపల్లి శ్రీనివాసరావు, ఉస్కె గంగారాం, బాలకృష్ణారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉమ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు, సంఘ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”









