-- --

ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూరలో పల్లె నిద్ర కార్యక్రమం.. గ్రామ సమస్యలపై పోలీసుల ఆరా…

బోధన్: గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో సాలూర గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్థులతో పోలీసులు సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. గ్రామస్థుల అభిప్రాయాలను తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి పోలీసుల సహకారం అందిస్తామని భరోసా కల్పించారు.

అనంతరం రోడ్డు భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, అసాంఘిక కార్యకలాపాల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు బలోపేతం కావడంతో పాటు గ్రామస్థుల భాగస్వామ్యంతో సురక్షితమైన గ్రామాల నిర్మాణానికి ‘పల్లె నిద్ర’ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

– బోధన్ రూరల్ ఎస్‌ఐ…

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more