-- --

నవీపేట్‌లో ఘనంగా గాండ్ల తేలుకుల సంఘం బోనాల పండుగ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

భాజా భజంత్రీల నడుమ గ్రామదేవతలకు సలాంబాలు, బోనాల సమర్పణ.. పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు…

నవీపేట్, నవంబర్ 2: నవీపేట్ మండల కేంద్రంలో గాండ్ల తేలుకుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సలాంబాలు, బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, భక్తుల జయజయధ్వానాలతో గ్రామదేవతల ఆలయాలు మార్మోగాయి.

పండుగలో భాగంగా మహిళలు, భక్తులు సలాంబాలు, బోనాలను ఎత్తుకొని భాజా భజంత్రీల నడుమ గ్రామదేవతల ఆలయాల వరకు ఊరేగింపుగా వెళ్లారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ ఊరేగింపులో కుల సంఘం సభ్యులు, యువతీ యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గ్రామదేవతలకు సలాంబాలు, బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించి, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో శాంతిసౌభాగ్యాలు వెల్లివిరియాలని ప్రార్థించారు.

సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను గ్రామస్తులంతా ఐక్యంగా జరుపుకోవడంతో నవీపేట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తి, సంప్రదాయం, సామాజిక ఐక్యతను చాటుతూ ఈ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

ఈ కార్యక్రమంలో పునాది అంజయ్య, వార్డు మెంబర్ బునాది నవీన్, బునాది మంజుల, ప్రవీణ్, దేవేందర్, శ్రీనివాస్, రవి, చందు, రాజమణి, సునంద, సావిత్రి, సుజాత, సుకృత, రచన, రాధికతో పాటు కుల సంఘం పెద్దలు, సభ్యులు, యువతీ యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more