-- --

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీలో గళమెత్తిన కాంగ్రెస్ శ్రేణులు..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీలో గళమెత్తిన కాంగ్రెస్

‘ఛలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి…

బోధన్: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల రక్షణే లక్ష్యంగా న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి (INDIA Bloc) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ ర్యాలీకి బోధన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కులమతాలకు అతీతంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే సంకల్పంతో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇండియా కూటమి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ మహా ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలనే డిమాండ్లతో కూటమి నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో గళమెత్తారు.

బోధన్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణుల భాగస్వామ్యంతో ర్యాలీకి మరింత ఉత్సాహం నెలకొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొనడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more