-- --

పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ…

బోధన్, అక్టోబర్ 31 (V1 న్యూస్): దేశ రక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ బోధన్ పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ర్యాలీ అమరవీరుల సేవలను స్మరించుకోవడంతో పాటు ప్రజల్లో దేశభక్తి, పోలీసుల పట్ల గౌరవభావాన్ని పెంపొందించేలా సాగింది.

బోధన్ బస్టాండ్ వద్ద ప్రారంభమైన ర్యాలీని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం అనిల్ టాకీస్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ముందుకు సాగిన పోలీసులు, విద్యార్థులు పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రత కోసం పనిచేసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఠాణా ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ, రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్‌ఐలు రాజశేఖర్, గంగాధర్, శ్రీనివాస్ వంశీ, రామ్, హబీబ్, రాజు, పోలీస్ శాఖ సిబ్బంది, విద్యా వికాస్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more