-- --

రియాద్‌లో ఘనంగా తెలుగు సంబరాలు.. TBD సీజన్–5

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పిలుపు.. సౌదీ నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగు కుటుంబాలు…

రియాద్, సెప్టెంబర్ 21: తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు తెలుగు వారసత్వాన్ని అందించాలనే సందేశంతో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్–5 రియాద్‌లో ఘనంగా జరిగింది. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు కుటుంబాలు, సంఘాల ప్రతినిధులు, సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.

తెలుగు భాష పరిరక్షణకు ప్రాధాన్యం

కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయం, సౌదీ అరేబియాలో రెండవ కార్యదర్శి (కాన్సులర్) శ్రీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలుగు సమాజాన్ని ఆయన అభినందించారు. తెలుగు ప్రజలు ఐకమత్యంతో ముందుకు సాగుతూ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఖాజా ముజమ్మిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

భావితరాలకు తెలుగు వారసత్వం అందించాలి…

SATA వ్యవస్థాపకులు శ్రీ మల్లేశం మాట్లాడుతూ విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వాటిని భావితరాలకు అందించేందుకు నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

SATA రియాద్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజలు ఒకే వేదికపైకి వచ్చి తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమన్నారు. భాషా సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి సేవలను స్మరించుకునే రోజుగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగు భాషను ప్రజల నిత్య వ్యవహార భాషగా తీర్చిదిద్దేందుకు గిడుగు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

SATA ఉపాధ్యక్షులు శ్రీ మహమ్మద్ నూరుద్దీన్ మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు తెలుగు ప్రజల మధ్య ఐక్యత, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో TBD వేదికగా నిలుస్తోందన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

మహిళల భాగస్వామ్యం.. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి…

SATA మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శర్వాణి విద్యాధరిణి, మహిళా ఉపాధ్యక్షులు శ్రీ కోకిల ఒత్లూరి మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు కుటుంబాలు ఒకే వేదికపైకి వచ్చి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

కార్యక్రమంలో SATA జెద్దా అధ్యక్షులు శ్రీ అంజాద్ బైగ్, TASA ఫౌండర్ స్వామి, గల్ఫ్ జనసేన–సౌదీ అరేబియా టీమ్ కన్వీనర్ అమీర్ ఖాన్, GTO రియాద్ మహిళా అధ్యక్షురాలు నాజియా, GTO జెద్దా అధ్యక్షులు షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

అంజాద్ బైగ్ అందించిన సంగీత ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్నారులు, యువత, కుటుంబ సభ్యులు ప్రదర్శించిన సంగీతం, నృత్యం, కళా కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ తెలుగు విందు సైతం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌదీ అరేబియాలో ఉన్నప్పటికీ స్వదేశంలో తెలుగు పండుగను జరుపుకుంటున్న అనుభూతి కలిగిందని పలువురు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

సామాజిక సేవల్లోనూ SATA ముందంజ…

తెలుగు ప్రజలకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అవసరమైన సహాయం అందించేందుకు SATA కోర్ టీమ్ సమన్వయంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన సందర్భాల్లో భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు మార్గదర్శకత్వం, సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సేవా కార్యక్రమాల్లో మహమ్మద్ నూరుద్దీన్ (వరంగల్), మిథున సురేష్ (నిజామాబాద్–ARP Camp), ముజామిలుద్దీన్ (కోరుట్ల), వీరవల్లి యోగేశ్వరరావు (తణుకు), సింగు నరేష్ (మెట్‌పల్లి), శహబాజ్ అహ్మద్ (జగిత్యాల), ముదిగొండ శంకర్ (కామారెడ్డి) తదితరులు భాగస్వాములుగా ఉన్నట్లు తెలిపారు.

కార్యక్రమ విజయానికి కోర్ టీమ్ కృషి…

TBD సీజన్–5 విజయవంతం కావడంలో SATA కోర్ టీమ్, ఆర్గనైజింగ్ టీమ్, వాలంటీర్లు, సాంస్కృతిక బృందాలు, స్పాన్సర్లు, సపోర్టర్లు కీలక పాత్ర పోషించారని నిర్వాహకులు తెలిపారు. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణించి కార్యక్రమానికి హాజరైన తెలుగు కుటుంబాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

SATA రియాద్ కోర్ టీమ్ సభ్యులు శర్వాణి విద్యాధరిణి, కోకిల ఒత్లూరి, నిహారిక, శ్రీనివాస్ మచ్చ, మహమ్మద్ నూరుద్దీన్, లోకేష్ తాళ్ల, ముజామిలుద్దీన్, వీరవల్లి యోగేశ్వరరావు, సింగు నరేష్, శహబాజ్ అహ్మద్, మిథున సురేష్, ముదిగొండ శంకర్, మురళీకృష్ణ బూసి, చరణ్, పదాల శేఖర్, అస్లాం రోజదార్, రామ్ రేలంగి, అంజాద్ బైగ్, సౌకత్ అలీ తదితరులు కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.

తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ సౌదీ అరేబియాలోని తెలుగు సమాజం మరింత ఐక్యత, సహకారం, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more