-- --

మన అంగన్‌వాడీ – మన బాధ్యత”పై అవగాహన..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

కోస్లీ గ్రామంలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

కోస్లీ, సెప్టెంబర్ 17 (V1 న్యూస్): మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసం–2026లో భాగంగా “మన అంగన్‌వాడీ – మన బాధ్యత” కార్యక్రమాన్ని కోస్లీ గ్రామపంచాయతీ పరిధిలో గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో గర్భిణీలు, చిన్నారుల తల్లులు, గ్రామ ప్రజలకు **హాట్ కుక్డ్ మీల్ మెనూ (Hot Cooked Meal Menu)**పై అవగాహన కల్పించారు. మెను చార్ట్‌ను ప్రదర్శిస్తూ అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం, దాని ప్రాధాన్యతను వివరించారు.

అలాగే స్థానికంగా సులభంగా లభించే ఆహార పదార్థాలతో తయారు చేసుకునే ప్రాంతీయ వంటకాలు, THR (Take Home Ration) వంటకాలపై అవగాహన కల్పించారు. పోషకాహారం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.

పోషణ మాసం సందర్భంగా పాల్గొన్న వారితో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా CB Events‌లో భాగంగా చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ జాదవ్ బాబు సింగ్, ఉపసర్పంచ్ బట్వారి సందీప్, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు. వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, IKP నుంచి CAలు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, గర్భిణీలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more