బోధన్‌కు అంతర్జాతీయ గౌరవం
లయన్స్ ‘మిషన్ 1.5’ పురస్కారంతో పోలవరపు బసవేశ్వరరావుకు సత్కారం
బోధన్, సెప్టెంబర్ 16 (V1 న్యూస్): సామాజిక సేవలో తనదైన ముద్ర వేసిన బోధన్‌కు చెందిన పోలవరపు బసవేశ్వరరావుకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. లయన్స్ ఇంటర్నేషనల్ చేపట్టిన ‘మిషన్ 1.5 మిలియన్ మెంబర్షిప్’ కార్యక్రమంలో సభ్యత్వ విస్తరణకు విశేష కృషి చేసినందుకు ఆయనకు ‘మిషన్ 1.5 మిలియన్ మెంబర్షిప్ రాక్‌స్టార్’ అవార్డు అందజేశారు.
అంతర్జాతీయ ప్రెసిడెంట్ లయన్ మార్క్ ఎస్. చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని బసవేశ్వరరావు స్వీకరించారు. లయన్స్ మల్టీపుల్ కౌన్సిల్ జీఎంటీగా, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా సేవలందించిన ఆయన మూడు దశాబ్దాలుగా సామాజిక సేవకు అంకితమై పనిచేస్తున్నారు.
బసవేశ్వరరావుకు అంతర్జాతీయ పురస్కారం దక్కడం పట్ల బోధన్ పట్టణ ప్రముఖులు, లయన్స్ క్లబ్ సభ్యులు, సేవా రంగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. బోధన్ పేరు అంతర్జాతీయ వేదికపై వినిపించేలా చేసిన ఈ గుర్తింపు పట్టణానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







