-- --

రీ-సర్వేపై గ్రామస్థులకు అవగాహన

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, సెప్టెంబర్ 17 (V1 న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా బోధన్ మండలం బండారుపల్లి గ్రామంలో గురువారం ప్రత్యేక రీ-సర్వే గ్రామసభ నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు బండారుపల్లి గ్రామ అంగన్వాడీ–ప్రాథమిక పాఠశాల వేదికగా జరిగిన ఈ గ్రామసభలో బోధన్ ఆర్డీఓ శ్రీమతి ఎం. విజయకుమారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రీ-సర్వే కార్యక్రమం ఉద్దేశ్యం, చేపట్టే ప్రక్రియ, భూ వివరాల నమోదు, సర్వే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై గ్రామస్థులకు అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు ఆఫ్ సర్వే, బోధన్ తహసీల్దార్, మండల్ సర్వేయర్, బండారుపల్లి గ్రామ సర్పంచ్, లైసెన్స్డ్ సర్వేయర్లు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం గ్రామస్థుల నుంచి భూ సర్వేకు సంబంధించిన సందేహాలు, సమస్యలను అధికారులు స్వీకరించారు. గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానాలు అందిస్తూ, రీ-సర్వే ప్రక్రియపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. భూ వివరాల విషయంలో పారదర్శకత, ఖచ్చితత్వం కోసం ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వేలో గ్రామస్థులు సహకరించాలని అధికారులు సూచించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more