బోధన్, సెప్టెంబర్ 16 (V1 న్యూస్):
అనారోగ్యం, ఆపద వంటి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని 1వ వార్డు కౌన్సిలర్ రాంమూర్తి, స్థానిక నాయకులు పేర్కొన్నారు.
బుధవారం బోధన్ పట్టణ పరిధిలోని ఆచన్పల్లికి చెందిన భూమయ్యకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును కౌన్సిలర్ రాంమూర్తి, స్థానిక నాయకులు కలిసి ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలవడం అభినందనీయమన్నారు. అత్యవసర వైద్య ఖర్చులను భరించలేని నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా లభిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, సాయిలు, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







