సాలూర, సెప్టెంబర్ 17 (V1 న్యూస్): సాలూర మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్, తహసీల్దార్ కార్యాలయం, సొసైటీ ఆవరణల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.ఏ. నవాజ్, ఎంపీడీవో నరసయ్య, సర్పంచ్ సొక్కం లావణ్య రవి, సాలూర సొసైటీ చైర్మన్ అల్లే జనార్ధన్, ఇల్తేప్ శంకర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సతీష్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







