-- --

రియాద్‌లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అభిమానులు

రియాద్: జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జనసేన మద్దతుదారులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

జనసేన రియాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అభిమానులు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు, సేవా దృక్పథం, యువతకు అందిస్తున్న ప్రేరణను కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగడంతో పాటు ప్రజా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

జనసేన రియాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు అభిమానుల ఉత్సాహంతో సందడిగా సాగాయి. కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు, మద్దతుదారులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more