సాలూరలో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య పండుగ
సాంప్రదాయబద్ధంగా ఎడ్లకు ప్రత్యేక పూజలు.. రంగురంగుల అలంకరణలతో గ్రామంలో సందడి…

సాలూరా, సెప్టెంబర్ 10 (వి.1 న్యూస్):
సాలూరా మండల వ్యాప్తంగా గురువారం ఎడ్ల పొలాల అమావాస్య పండుగను రైతులు, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంలో తమకు తోడుగా నిలిచే ఎడ్లను దైవస్వరూపంగా భావించే ఆనవాయితీకి అనుగుణంగా రైతులు వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగను జరుపుకున్నారు.
సాలూరా గ్రామంలో గ్రామ పోలీస్ పటేల్ వెంకట్ పటేల్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రైతులు తమ ఎడ్లను శుభ్రంగా కడిగి, రంగురంగుల వస్త్రాలు, పూలమాలలు తదితరాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఎడ్లకు ప్రత్యేక పూజలు చేసి, గ్రామంలోని హనుమాన్ మందిరం చుట్టూ సంప్రదాయబద్ధంగా ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

వ్యవసాయ పనుల్లో రైతులకు అండగా నిలిచే పశువుల పట్ల కృతజ్ఞతను చాటుకోవడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతు కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజలు, ఊరేగింపు అనంతరం రైతులను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొని పండుగను విజయవంతం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







