-- --

బోధన్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్‌..! ఇద్దరు కీలక కౌన్సిలర్లు పార్టీ మారుతున్నారా?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అసంతృప్తి సెగలు.. ప్రత్యర్థి పార్టీలతో మంతనాలంటూ ప్రచారం | అధిష్టానానికి తప్పని కొత్త తలనొప్పి

బోధన్, సెప్టెంబర్ 11 (వి.1 న్యూస్‌):
బోధన్ పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. పట్టణంలో ఓ ప్రధాన పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ముఖ్య కౌన్సిలర్లు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు నేతలు గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలపై అసంతృప్తితో ఉన్నారని, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలపై దృష్టి సారించారన్న చర్చ జోరుగా సాగుతోంది.
పట్టణ రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న ఈ ఇద్దరు కౌన్సిలర్లు ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న సమాచారం ఇప్పుడు ఆయా పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే పార్టీ మార్పుపై సంబంధిత కౌన్సిలర్లు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఇప్పటికే బోధన్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరు తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న ఈ పార్టీ మార్పు ప్రచారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

కీలక వికెట్లు జారిపోతాయా?

ఇద్దరు కౌన్సిలర్లు పార్టీని వీడితే పట్టణంలో ఆ పార్టీ రాజకీయ బలాబలాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వారితో పాటు మరికొందరు స్థానిక నాయకులు కూడా అదే బాట పట్టే అవకాశం ఉందన్న చర్చ పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగుతుందా? అసంతృప్త నేతలతో చర్చలు జరిపి వారిని పార్టీలోనే కొనసాగించే ప్రయత్నం చేస్తుందా? లేక ఈ వ్యవహారం మరింత ముదిరి కీలక రాజకీయ వికెట్లు చేజారిపోతాయా? అన్నది ప్రస్తుతం బోధన్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
అయితే ఈ పార్టీ మార్పు ప్రచారంపై సంబంధిత కౌన్సిలర్లు లేదా ఆయా పార్టీల నుంచి అధికారిక స్పష్టత వస్తేనే వాస్తవ పరిస్థితి పూర్తిగా తేలే అవకాశం ఉంది.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more