దళితులను అవమానించే వ్యాఖ్యలను సహించేది లేదని కాంగ్రెస్, దళిత సంఘాల హెచ్చరిక….

సాలూరా, సెప్టెంబర్ 11 (వి.1 న్యూస్):
స్పీకర్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినట్లు పేర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సాలూరాలో కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు.

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని…
నిరసనకారులు హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వివాదాస్పద వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







