-- --

“ఎస్‌ఐఆర్‌ విచారణలో పారదర్శకతే లక్ష్యం” “అర్హులైన ఓటర్ల వివరాల నమోదులో అప్రమత్తంగా వ్యవహరించాలి”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఎస్‌ఐఆర్‌ నోటీసుల విచారణను పరిశీలించిన తహసీల్దార్‌…

తగెల్లి, ఫాతేపూర్‌లో కొనసాగుతున్న ప్రక్రియపై క్షేత్రస్థాయిలో సమీక్ష…

సాలూరా, సెప్టెంబర్‌ 9 (వి.1 న్యూస్‌): సాలూరా మండలంలోని తగెల్లి, ఫాతేపూర్‌ గ్రామాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ నోటీసుల విచారణ ప్రక్రియను తహసీల్దార్‌ అజ్మత్‌ నవాజ్‌ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి సమాధానాలు, సంబంధిత ధ్రువపత్రాల స్వీకరణ, వాటి పరిశీలన జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించి సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంబంధిత పత్రాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని తహసీల్దార్‌ సూచించారు. అర్హత కలిగిన ఓటర్ల పేర్లు, వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయడంతో పాటు, అనర్హత లేదా వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
నోటీసులు అందుకున్న ప్రజలు తమకు అందుబాటులో ఉన్న అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి విచారణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ప్రజలకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించాలని బీఎల్‌ఓలు, రెవెన్యూ సిబ్బందికి సూచించారు.
విచారణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలని తహసీల్దార్‌ స్పష్టం చేశారు. గ్రామాల్లో నోటీసుల విచారణ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నూర్‌ అహ్మద్‌, ఉప సర్పంచ్‌ మోసీన్‌, బీఎల్‌ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more