-- --

పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రజల గొడవను తన గొడవగా చేసుకున్న ప్రజాకవి కాళోజీ — ఏసీపీ గురునాయుడు
నిజామాబాద్, సెప్టెంబర్ 9 (వి.1 న్యూస్): నిజామాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రజాకవి, పద్మభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏసీపీ గురునాయుడు మాట్లాడుతూ.. సగటు మనిషే కాళోజీ కవిత్వానికి వస్తువని, ప్రజల గొడవను తన గొడవగా చేసుకున్న మహోన్నత ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. స్వతంత్ర దృష్టి, స్వతంత్ర భావన ఆయన కవిత్వానికి, వ్యక్తిత్వానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని తెలిపారు. ప్రజల సమస్యలను తన రచనల ద్వారా నిర్భయంగా వ్యక్తపరిచిన కాళోజీకి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించిందని గుర్తుచేశారు.
భావితరాల కోసం కృషి చేయాలి
తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పోలీస్‌ శాఖ సిబ్బందికి పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేసి, వారికి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏవో ఆసియా బేగం, ఆఫీస్‌ సూపరింటెండెంట్లు జగతి, వనమాల, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఆర్. అంజయ్య, పాండేరావు, సీసీఆర్‌బీ, కంట్రోల్‌ రూమ్‌, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొని కాళోజీకి నివాళులర్పించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more