-- --

బోధన్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బాలికల కోసం ప్రత్యేక క్యాంపస్ – రూ.200 కోట్లతో ఆధునిక విద్యా వసతులు: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..

బోధన్, జూలై 22 (వి1 న్యూస్):
బోధన్ పట్టణ శివారులోని బిలాల్ ఫారంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఈఎన్‌సీ రఘుపతి రెడ్డి, నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ భూజంగరావు, బోధన్ ఆర్డీఓ విజయకుమారి, విద్యుత్ శాఖ డీఈ ముఖ్తార్ అహ్మద్ తదితర అధికారులు పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ఆధునిక సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌లను నిర్మిస్తోందని తెలిపారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు.

విద్యతో పాటు వసతి, పోషకాహారం, ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో 2,500 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా నిర్మాణం చేపడుతుండగా, డైనింగ్ హాల్‌లో ఒకేసారి సుమారు 1,300 మంది విద్యార్థులు భోజనం చేసే సామర్థ్యం ఉంటుందని వెల్లడించారు.

బోధన్‌లో బాలికల విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఇక్కడ నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖ ఈఎన్‌సీ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ల పనులను రాబోయే ఏడాదిన్నరలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రతినిధి చైర్‌పర్సన్ శరత్ రెడ్డి, దాము, మహ్మద్ జహీర్, షేక్ మొహియుద్దీన్ పాషా, మున్సిపల్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more