-- --

బోధన్ ఆరకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోనమెత్తిన ఆర్డీవో ఎం. విజయకుమారి.. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు..

బోధన్, జూలై 21 (వి1 న్యూస్): 

బోధన్ పట్టణంలోని 36వ వార్డులో ఆరకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను హిందూ సంప్రదాయాల ప్రకారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బోధన్ ఆర్డీవో ఎం. విజయకుమారి హాజరై బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 36వ వార్డు కౌన్సిలర్ సభ జావీద్, మహేష్ మహరాజ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుమ్మరి గల్లీలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించిన అనంతరం, అక్కడి నుంచి మహాలక్ష్మి మందిర్ వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆరకటిక సంఘం సభ్యులు గంగారం చౌదరి, రాజులాల్, మహేష్, రాజేందర్, గంగాలాల్, రాజేశ్వర్, మహిరాజ్ తదితరులు పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా బోనాల పండుగ ఘనంగా కొనసాగింది.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more