రూ.6,630 నగదు, 9 సెల్ఫోన్లు, మోటార్‌సైకిళ్లు స్వాధీనం – జూదం నిర్వహించినా, ఆడినా కఠిన చర్యలే: కోటగిరి ఎస్సై శ్రీనివాస్..
V1 న్యూస్, పొతంగల్/హంగర్గా ఫారం, జూలై 21:
పొతంగల్ మండలంలోని హంగర్గా ఫారం గ్రామంలో డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు, అక్కడి నుంచి రూ.6,630 నగదు, 9 సెల్ఫోన్లు, మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కోటగిరి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడటం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర నష్టాలు చవిచూస్తాయని, ముఖ్యంగా యువత ఇటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
గ్రామాల్లో పేకాట స్థావరాలు నిర్వహించే నిర్వాహకులతో పాటు వాటిలో పాల్గొనే వారిపైనా ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్టాన్ని ఉల్లంఘించి పేకాట నిర్వహించినా, ఆడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







