విద్యార్థుల ప్రగతి, పాఠశాల అభివృద్ధిపై చర్చ.. గదుల కొరత పరిష్కారానికి హామీ
సాలూరు, జూలై 18:
సాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పేరెంట్-టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు.
సమావేశంలో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్), విద్యా ప్రగతి, బోధన నాణ్యత, పాఠశాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాలలో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదులు అవసరమని పేర్కొన్నారు.

ఈ సమస్యను గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని సమావేశంలో హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, కాముని స్వామి, రుద్ర సంతోష్ యాదవ్, కాంబ్లే విఠల్, శోభారాణి, అంజనతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
“విద్యకు వేసిన పునాది… సమాజానికి బలమైన భవిష్యత్తు.”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







