Post Views: 184
“పారదర్శకత ఉంటే ప్రజల నమ్మకం పెరుగుతుంది.”
హైదరాబాద్, జూలై 18:
తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల కుటుంబాల కోసం రూపొందించిన కొత్త రేషన్ కార్డుల ముద్రణ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ఆయా జిల్లాలకు కార్డులను కూడా అధికారులు పంపించారు.
ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తేదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేయాల్సి ఉంది. సీఎం ఆమోదం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పంపిణీ ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కొత్త రేషన్ కార్డులను క్రెడిట్, డెబిట్ కార్డు పరిమాణంలో రూపొందించారు. కార్డుపై లబ్ధిదారుడి ఫోటో, పేరు, చిరునామా వంటి వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఇప్పటివరకు పొందిన బియ్యం, చక్కెర, గోధుమలు తదితర రేషన్ సరుకుల పంపిణీ వివరాలు అందుబాటులోకి వస్తాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ తరహా స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రానుండటం విశేషం. ప్రస్తుతం అమల్లో ఉన్న కాగితపు రేషన్ కార్డులకు బదులుగా ఈ డిజిటల్ సదుపాయాలతో కూడిన కార్డులు పంపిణీ చేయడం ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు లబ్ధిదారులకు మరింత సౌలభ్యం కలగనుందని అధికారులు భావిస్తున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







