ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ప్రారంభోత్సవం.. సనాతన ధర్మ పరిరక్షణకు వేద విద్యే పునాది: వక్తలు
కామారెడ్డి, జూలై 18:
కామారెడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన వేద గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం శనివారం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామీజీలు ఆశీర్వచనాలు అందించి, సనాతన ధర్మం, వేద విద్య ప్రాధాన్యంపై ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక వక్తలు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో వేద గురుకులాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. నేటి తరానికి వేదాలు, భారతీయ విలువలు, సంస్కృతి బోధించడం ద్వారా ధార్మిక చైతన్యం పెంపొందుతుందని, వేద విద్య పునర్వైభవానికి ఇటువంటి విద్యాసంస్థలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

శ్రీ అంకుష్ స్వామి రామ్ ధారీ మాట్లాడుతూ, “సనాతన ధర్మ సేవలో భాగస్వామ్యం కావడం ప్రతి ఒక్కరి అదృష్టం. ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడం పుణ్యప్రదమైన కార్యం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్వామీజీలు, ఆధ్యాత్మిక ప్రముఖులు, ధర్మాభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమం ముగింపులో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి ఆశీర్వాదాలు అందజేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







