పోలీసుల కళ్లుగప్పి కోట్లకు చేరువలో జూదం.. మద్యం, ఫైనాన్స్‌తో జూదగాళ్లకు ఎర..!
వర్ని, జూలై 17:
వర్ని మండల కేంద్రంలోని జాకోరా–నెహ్రూనగర్ దర్గాను కొందరు జూద నిర్వాహకులు పేకాట కేంద్రంగా మార్చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పవిత్ర స్థలంలోనే బహిరంగంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తూ లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
స్థానికుల సమాచారం మేరకు, ఎస్.ఎన్.పురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ పేకాట దందాకు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మల్లారం గండి అటవీ ప్రాంతంలో జూదం నిర్వహించిన వీరు, ప్రస్తుతం స్థలాన్ని మార్చి దర్గా పరిసరాల్లోనే యథేచ్ఛగా పేకాట కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల కదలికలను పసిగట్టేందుకు దూర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇన్ఫార్మర్లను నియమించి, వారికి రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. అనుమానాస్పద వ్యక్తులు లేదా పోలీసులు వస్తున్నట్లు తెలిసిన వెంటనే నిర్వాహకులకు సమాచారం చేరవేయడంతో, పలుమార్లు పోలీసులు వచ్చినా నిర్వాహకులు తప్పించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది.
పేకాటకు వచ్చే వారికి మద్యం, బిర్యానీ, సిగరెట్లు, గుట్కాలు ఉచితంగా అందించడమే కాకుండా, డబ్బులు పోయిన వారికి అక్కడికక్కడే ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అవసరమైతే బైకులు, సెల్‌ఫోన్లు, బంగారం తాకట్టు పెట్టించి నగదు ఇచ్చి మళ్లీ ఆటలోకి దింపుతున్నట్లు చెబుతున్నారు.
పవిత్ర స్థలాన్ని జూదానికి అడ్డాగా మార్చి యువతను వ్యసనాల బారిన పడేస్తున్న ఈ ముఠాపై పోలీసులు ఎప్పుడు ఉక్కుపాదం మోపుతారనే ప్రశ్న స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
తక్షణమే ప్రత్యేక దాడులు నిర్వహించి, నిర్వాహకులతో పాటు వారికి సహకరిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








