June 29, 2026 11:36 pm

V1News Telangana

అన్నదానం మహాదానం… భక్తి ఉన్న చోటే భగవంతుని కృప!”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

గంగమ్మ ఆలయ 15వ వార్షికోత్సవం ఘనంగా

ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదాన సేవ

సాలూర, జూన్ 29 ): నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని శ్రీ గంగమ్మ ఆలయంలో సోమవారం 15వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సాలూర సర్పంచ్ సొక్కం లావణ్య–రవి, గ్రామ పోలీస్ పటేల్ వెంకట్ పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం సభ్యులు మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, భక్తులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. భక్తి, సేవాభావంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని పేర్కొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more