June 25, 2026 11:19 pm

V1News Telangana

తెలియదన్న ఎంఈఓ… చూస్తున్న ప్రజలు!” ప్రైవేట్ స్కూళ్ల దౌర్జన్యాలపై తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆగ్రహం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అవగాహన లేని అధికారులతో విద్యార్థులకు న్యాయం ఎలా..? – మీసాల నాగేష్

కాపలాదారుడే నిద్రపోతే… దొంగల పండుగే!”

బోధన్, జూన్ 25:
ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై సోషల్ మీడియా, యూట్యూబ్ మాధ్యమాల్లో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాల నాగేష్ ఘాటుగా స్పందించారు.

మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రైవేట్ విద్యా సంస్థలను నేరుగా సందర్శించి పరిశీలించగా పాఠశాలల ప్రాంగణాల్లోనే పుస్తకాలు, యూనిఫాంల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, “దీనిపై మాకు ఎలాంటి అవగాహన లేదు” అని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

విద్యా సంస్థల్లో బహిరంగంగా జరుగుతున్న వ్యవహారాలపై సంబంధిత అధికారికి అవగాహన లేకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సిన అధికారులు “తెలియదు” అని చెప్పడం ద్వారా తమ విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, బలవంతపు పుస్తకాలు, యూనిఫాంల కొనుగోళ్లు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం వంటి అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, విద్యా వ్యవస్థపై పూర్తి అవగాహన లేని ప్రస్తుత ఎంఈఓను వెంటనే బదిలీ చేసి, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల హక్కులను కాపాడటంలో అధికారులు విఫలమైతే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఆరోపణలపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ప్రశ్న

“విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన అధికారులు మౌనం వహిస్తే… బాధ్యత ఎవరిది?”
“నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు ఎప్పుడు..?”
“ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలకు అడ్డుకట్ట వేయేది ఎవరు..?”

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more