హౌస్ నంబర్ల నుంచి భూ సమస్యల వరకు 8 దరఖాస్తులు నమోదు…
బోధన్, జూన్ 15:
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఆర్‌డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజనల్ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 8 దరఖాస్తులు నమోదయ్యాయి. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు తమ వినతులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజావాణిలో మున్సిపల్ పరిధిలో హౌస్ నంబర్ల కేటాయింపు, డ్రైనేజీ సమస్యలు, విద్యాశాఖకు సంబంధించిన పాఠశాల ఫీజుల అంశం, రైతుబంధు పథకం అమలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మరణ ధ్రువీకరణ పత్రం జారీ, భూ వివాదాలు తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు.
వినతులను స్వీకరించిన అధికారులు సంబంధిత శాఖల ద్వారా సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజావాణి ద్వారా తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించాలని బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








