భద్రతా ప్రమాణాలు లేని స్కూల్, కాలేజ్ బస్సులకు అనుమతులు రద్దు చేయాలని ఆర్టీఏకు వినతి…
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన (బి.వి.ఎస్) ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీఏ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బి.వి.ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు కస్పలింగం మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని స్కూల్, కాలేజ్ ప్రైవేట్ బస్సులు రవాణా శాఖ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుస్తున్న బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని కోరారు. అలాగే రేడియం స్టిక్కర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ సేఫ్టీ బాక్స్, మెడికల్ కిట్ వంటి తప్పనిసరి భద్రతా ప్రమాణాలు లేని బస్సులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు మంజూరు చేయరాదన్నారు.
విద్యార్థులు బస్సులో ఉన్న సమయంలో పెట్రోల్ బంకులకు వెళ్లే ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఏ అధికారులను కోరారు. నిర్లక్ష్యం కారణంగా అమాయక విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో చిక్కం ప్రవీణ్, పంజాబ్ సింగ్, ఏర్సో ఆకాష్, సాయికుమార్, గంగాధర్, చంద్రశేఖర్, రేయాన్‌తో పాటు భారతీయ విద్యార్థి సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









