నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ఆకస్మిక సోదాలు తీవ్ర సంచలనంగా మారాయి. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టడంతో పోలీస్ వర్గాల్లో కలకలం నెలకొంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) భాస్కర చారిపై లంచం స్వీకరణ ఆరోపణలు రావడంతో అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది. ఓ పాత కేసు విషయంలో డబ్బులు తీసుకున్నారనే ఫిర్యాదు ఆధారంగా ACB అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
దాడుల అనంతరం ఎస్ఐ భాస్కర చారిని అదుపులోకి తీసుకుని బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పలుమార్లు విచారించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, లంచం మొత్తం, ఫిర్యాదుదారు వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
ఈ ఘటనతో బోధన్ పట్టణంలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలోనే అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
“లంచం ఇవ్వొద్దు.. వెంటనే ఫిర్యాదు చేయండి” : ACB హెచ్చరిక
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ACB అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. లంచం ఇవ్వడం కూడా నేరమేనని స్పష్టం చేశారు.
ఫిర్యాదుల కోసం:
టోల్ ఫ్రీ నంబర్: 1064
వాట్సాప్ నంబర్: 9440446106
వెబ్‌సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ACB అధికారులు తెలిపారు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








