May 5, 2026 5:36 pm

V1News Telangana

ట్రాఫిక్ సిబ్బందికి కూల్ వాటర్ ప్లాస్కులు, ORS ప్యాకెట్లు పంపిణీ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి అవసరమైన సహాయక సామగ్రిని నిజామాబాద్ వాసవి జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ట్రాఫిక్ సిబ్బందికి కూల్ వాటర్ ప్లాస్కులు, ORS ప్యాకెట్లు, మాస్కులు స్వయంగా అందజేశారు…


ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎండాకాలంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ప్రజల భద్రత కోసం వారు నిరంతరం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. శరీరంలో నీటి లోపం రాకుండా తరచూ నీరు తాగడం, ORS వినియోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాసవి జనత ఫౌండేషన్ ముందుకు వచ్చి ఈ సామగ్రిని అందించడం అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సహకార భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐ ప్రసాద్, రిజర్వ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వినోద్‌తో పాటు వాసవి జనత ఫౌండేషన్ సభ్యులు సాయి ప్రసాద్, మేటూరి లక్ష్మణ గుప్తా, గోలి ప్రసాద్, నితిన్ నంగనూరి, కళ్యాణి మోటూరి, బచ్చు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more