May 28, 2026 12:23 am

V1News Telangana

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు: ఒకరికి జైలు శిక్ష

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు: ఒకరికి జైలు శిక్ష

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం మార్చి 08:-

రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ముగ్గురు పట్టుబడ్డారు. వారిని గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరచగా, ఇద్దరికి రూ.4000 చొప్పున జరిమానా విధించారు. ఒక వ్యక్తి రెండోసారి పట్టుబడటంతో 3 రోజుల జైలు శిక్ష విధించి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహన పత్రాలు కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ హెచ్చరించారు. అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం నివారించాలని సూచించారు.

RAKESH NAMANI STAFF REPORTER
Author: RAKESH NAMANI STAFF REPORTER

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more