వ్యక్తిగత కారణాలే నిర్ణయానికి కారణమని వెల్లడి.. మండల వ్యాప్తంగా చర్చనీయాంశం

వార్త:
నవీపేట్ మండలం పరిధిలోని రాంపూర్ గ్రామపంచాయతీలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 6వ వార్డు సభ్యుడిగా ఎన్నికై, అనంతరం ఉపసర్పంచ్ బాధ్యతలు చేపట్టిన సురేష్ తన రెండు పదవులకు రాజీనామా చేశారు.
వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గ్రామస్థులకు, తన సహచరులకు తెలియజేశారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేసినప్పటికీ, అనివార్య పరిస్థితుల్లోనే పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించినట్లు సమాచారం.
సురేష్ ఆకస్మిక రాజీనామాతో రాంపూర్ గ్రామపంచాయతీతో పాటు నవీపేట్ మండల వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన నిర్ణయానికి గల అసలు కారణాలపై గ్రామంలో వివిధ స్థాయిల్లో చర్చ సాగుతోంది. కాగా, ఖాళీ అయిన పదవుల భర్తీపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచిచూడాల్సి ఉంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







