May 25, 2026 11:43 pm

V1News Telangana

జెడ్పీహెచ్‌ఎస్ సాలూరా సమ్మర్ క్యాంప్ ఘన ముగింపు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

జెడ్పీహెచ్‌ఎస్ సాలూరాలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌కు సోమవారం ఘనంగా ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్పంచ్ లావణ్య చేతుల మీదుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సమ్మర్ క్యాంప్‌లో నేర్చుకున్న యోగాసనాలు, డ్రాయింగ్‌లు, నృత్య ప్రదర్శనలు చేసి తమ ప్రతిభను, ఉత్సాహాన్ని చాటుకున్నారు. చిన్నారుల ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆకట్టుకోగా, వారు విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సమ్మర్ క్యాంప్‌లు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more