May 2, 2026 7:12 pm

V1News Telangana

సంక్షేమ పథకాలతో ప్రతి వర్గానికి అండ: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సంక్షేమ పథకాలతో ప్రతి వర్గానికి అండ: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం మార్చి 08:-

గోదావరిఖనిలో నిర్వహించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వికలాంగుల కోసం 18 స్కూటీలు, 7 ల్యాప్‌టాప్‌లు, 5G మొబైల్, 2 టాబ్‌లు పంపిణీ చేశారు. అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి 203 మంది సిబ్బందికి 5G మొబైళ్లు అందజేశారు. ఒక ఆయాకు అంగన్వాడీగా పదోన్నతి కల్పించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికి సహాయం అందిస్తూ, వికలాంగులు మరియు మహిళల ఆత్మనిర్భరతకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RAKESH NAMANI STAFF REPORTER
Author: RAKESH NAMANI STAFF REPORTER

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Comment

Read more
Read more