Post Views: 167
భారీ వర్షంతో ఇళ్లు కూలి నిరాశ్రయులైన పేదలకు అండగా నిలిచిన ఇందూరి చంద్రశేఖర్…
. టీఆర్ఎస్ పాలనలో అవినీతి పాపం – పేదల పాలిట శాపం..
. కాంగ్రెస్ పాలనలో న్యాయం చేస్తారన్న ప్రజల విశ్వాసం ఇందూరి చంద్రశేఖర్ పై…
రుద్రూర్‌కి స్వేచ్ఛ, సమానత్వం తీసుకొస్తారని ప్రజల ఆశాభావం.
రుద్రూర్, ఆగస్టు 19:
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రుద్రూర్ మండలంలో పలు ఇళ్లు కూలిపోవడంతో పేద కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో వారిని అంగడి బజార్ పాఠశాలలో ఆశ్రయింపజేశారు. ఈ క్రమంలో మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్ తన టీంతో కలిసి బాధితులను పరామర్శించి, వారికి పళ్ళు, పలహారాలు అందజేస్తూ అన్నదానం చేశారు. “అధైర్యపడకండి… నేనున్నాను” అంటూ వారికి ధైర్యం నూరిపోశారు. దీంతో మొదటిసారి వచ్చి పేదలతో భరోసా పంచుకున్న చంద్రశేఖర్ పై ప్రజలు “శభాష్ ఇందూరి చంద్రశేఖర్” అంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు, ప్రజల్లో రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి. గత టీఆర్ఎస్ పాలనలో కొంతమంది నేతల స్వార్థం, అవినీతి పాపం పేదల పాలిట శాపమైందని గ్రామస్తులు మండిపడుతున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయని, దీనిపై చంద్రశేఖర్ బహిరంగ సవాల్ విసిరినా ఎవ్వరూ సమాధానం చెప్పలేదని గుర్తుచేసుకుంటున్నారు. “ఇళ్లులేని పేదలకు న్యాయం జరగకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి” అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈసారి పేదలకు న్యాయం జరుగుతుందన్న ఆశలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రుద్రూర్ ప్రజల మనిషి ఇందూరి చంద్రశేఖర్ అండగా నిలుస్తారని నమ్ముతున్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు తప్పక వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఒక గ్రూపు అవినీతి, అక్రమాలు, దాడులు, తప్పుడు కేసులు సృష్టించి రౌడీయిజం ప్రదర్శించిందని ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈసారి ఇందూరి చంద్రశేఖర్ నేతృత్వంలో ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం పొందుతారని, రుద్రూర్‌కి కొత్త భవిష్యత్తు వస్తుందని చర్చలు జరుగుతున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








