Post Views: 199
దేగాం గ్రామంలో ఆసరా పేరుతో వంచన – వృద్ధుల్ని కూడా వదలకుండా దోచుకుంటున్నా..!
. రూ. 16 వసూలు.. ప్రశ్నిస్తే బెదిరింపులు – పోస్టాఫీస్‌లో పింఛన్ దారుల భగ్గుమణి!దేగాం గ్రామంలో ఆసరా పేరుతో వంచన – వృద్ధుల్ని కూడా వదలకుండా దోచుకుంటున్నా..!
. రూ. 16 వసూలు.. ప్రశ్నిస్తే బెదిరింపులు – పోస్టాఫీస్‌లో పింఛన్ దారుల భగ్గుమణి!
దేగాం: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామంలో బీపీఎం అక్రమాలపై వృద్ధులు, పింఛన్ లబ్ధిదారులు నిప్పులుకక్కుతున్నారు. ఆసరా పింఛన్ తీసుకెళ్లిన ప్రతి వృద్ధుడి నుంచి రూ. 2వేలలో రూ.16 చొప్పున కట్ చేస్తూ నాలుగు నెలలుగా ‘చిన్న కోత’ పేరిట పెద్ద దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
“ఇది ప్రభుత్వ పింఛన్. దీనిపై చేతులు వేయాలంటే సిగ్గు ఉండాలే గానీ..!” అని ఓ వృద్ధురాలు వాపోయింది. బీపీఎం కార్యాలయంలో శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో వృద్ధులు, మహిళలు చేరి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కట్ ఎందుకు చేస్తున్నావని’ ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆగ్రహంతో చెప్పారు.
“నెలకు ఒకే రోజు డబ్బులు ఇస్తూ వేయేళ్ళ వయసులో మమ్మల్ని తిరుగులాట పెట్టిస్తున్నావు.. ఇదేం న్యాయమా?” అంటూ వృద్ధులు మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న బీపీఎంపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పింఛన్‌కు అర్హత ఉన్న వారికి ప్రభుత్వమే ఇచ్చే డబ్బులు ఎవరైనా మధ్యలో దోచుకుంటే – అది ప్రజా ధనాన్ని లూటీ చేసినట్లేనని స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832










