June 17, 2026 3:32 am

V1News Telangana

సాలూరలో ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు.. . రైతు బాంధవుడిగా సేవలందిస్తున్న సుదర్శన్ రెడ్డి – పూజలు, అన్నదానంతో ఉత్సాహవంతమైన వేడుకలు..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికి సాలూర మండల ప్రజల అభినందనలు..బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికి సాలూర మండల ప్రజల అభినందనలు..

సాలూర, ఆగస్టు 2 (వి1 న్యూస్):
బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సాలూర మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో హనుమాన్ ఆలయం వద్ద ఈ వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పూజారులతో ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు, నాయకులు కలిసి మానసిక ఉల్లాసంతో జన్మదిన వేడుకలను జరిపారు.
ప్రజల పట్ల ఎప్పుడూ సహృదయతతో ఉంటూ, పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేను రైతు బాంధవుడు అంటూ నాయకులు ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి గ్రామస్థులకు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మందర్న రవి, పీఏసీఏస్ చైర్మన్ అల్లె జనార్ధన్, సీనియర్ నాయకులు అల్లె రమేష్, ఖజాపూర్ అశోక్, శ్రీనివాసరావు, సొక్కం రవి, ఇల్తెపు రమేష్, మైదపు నాగరాజు, డిస్కో సాయిలు, శివకాంత్ పటేల్, బుద్ధె లక్ష్మణ్, ఆలయ కమిటీ చైర్మన్ అల్లె శంకర్, శివాలయం కమిటీ చైర్మన్ లక్ష్మణ్, సాలూర క్యాంప్ రమేష్, స్వామి గౌడ్, హన్మంత్, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్, బ్రహ్మారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు…
ఉప్పు నరేందర్
Author: ఉప్పు నరేందర్

📢 ఉప్పు నరేందర్ 📰 బోధన్ రూలర్ రిపోర్టర్ 📞 సంప్రదించవలసిన నంబర్ : 9515361229

Leave a Comment

Read more
Read more