June 17, 2026 4:04 am

V1News Telangana

ఇందిరమ్మ ఇండ్లపై సాలూరలో మండల స్థాయి సమీక్ష సమావేశం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర మండల పంచాయతీ కార్యాలయంలో విభాగాల సమన్వయ సమావేశం..ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేకాధికారి సురేష్ కుమార్ సమీక్ష

. రేషన్ కార్డులు,, సీజనల్ వ్యాధుల నివారణపై అధికారులతో సమీక్ష
ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై హౌసింగ్ AEకి సూచనలు‌..

సాలూర, జూలై 24:సాలూర మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు మండల ప్రత్యేకాధికారి శ్రీ సురేష్ కుమార్ గారి అధ్యక్షతన మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమీక్షలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ, , సీజనల్ వ్యాధుల నియంత్రణ వంటి ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చించబడింది.ఈ సమావేశంలో **MPDO శ్రీనివాస్, MRO శశిభూషణ్, AE హౌసింగ్, AE PR, వైద్యాధికారి (PHC), వ్యవసాయ అధికారి (AO)**లు పాల్గొన్నారు.సమీక్ష సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో త్వ‌రితగతిలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని, దీనిపై AE హౌసింగ్‌కు ప్రత్యేక దిశానిర్దేశం చేశారు. అలాగే, రేషన్ కార్డుల పంపిణీ విధానం పారదర్శకంగా ఉండాలని MROకు సూచించారు.   సీజనల్ వ్యాధుల    నియంత్రణకు వైద్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అందించాలనే దృష్టితో విభాగాల సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేకాధికారి పిలుపునిచ్చారు. పథకాల అమలులో వేగం, సమర్థత, పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more