June 17, 2026 4:12 am

V1News Telangana

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

  •  కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకొని, బాణాసంచా పేల్చి సంబరాలు
  • నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థనలు, ప్రజలకు పూల మొక్కల పంపిణీ
  • భవిష్యత్తులో తెలంగాణకు కాబోయే రథసారథి అని అభివర్ణన

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి .. మాజీమంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో గల ప్రయాణ ప్రాంగణం ఆవరణలో కేక్ కట్ చేసి ఒకరికొకరు ఆత్మీయంగా తినిపించుకొని.. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో ప్రజలకు మరియు పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొడిసెల నర్సింలు గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుని వేడుకున్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే రథసారథి అని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో మంగలి సాయి కుమార్, దొంతి భాస్కర్, శ్రీను, లక్ష్మణ్, ఉప్పరి సాయిలు, దత్తు, రాజు, డి.సాయిలు, సాయి, దేవి ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more