June 17, 2026 3:30 am

V1News Telangana

భైంసా గాంధి గంజ్ వద్ద గంజాయి ముఠా అరెస్ట్ — ఇద్దరిని పట్టుకుని రిమాండ్‌కు పంపిన పోలీసులు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిర్మల్ జిల్లా, భైంసా, జూలై 15:

భైంసా పట్టణంలోని గాంధి గంజ్ గేట్ సమీపంలో నిషేధిత ఎండు గంజాయి అమ్మకానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను భైంసా టౌన్ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ G. గోపినాథ్ గారి నేతృత్వంలో, సబ్ ఇన్స్పెక్టర్ నవనీత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.

అరెస్టైన నిందితులు:

A3) షేక్ అహ్మెద్ (36) – ఓవైసినగర్, భైంసా

A5) ముజాహిద్ ఖాన్ @ సుల్తాన్ ఖాన్ @ ఇంతియాజ్ ఖాన్ (36) – బంగాలగల్లి, భైంసా

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, షేక్ అహ్మెద్ గాంధి గంజ్ మార్కెట్ ప్రాంతంలో ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య గంజాయి అమ్మకానికి వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం ఆధారంగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తులు గోడ చాటున ప్లాస్టిక్ కవర్లు పట్టుకొని ఉన్నారు. పోలీసులు చూసిన వెంటనే వారిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.

వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాల వివరాలు:

A3 వద్ద: 1230 గ్రాముల ఎండు గంజాయి

A5 వద్ద: 1340 గ్రాముల ఎండు గంజాయి

వీరిద్దరూ మహారాష్ట్ర నుండి గంజాయి తీసుకొచ్చి భైంసాలో అమ్మాలనే ఉద్దేశంతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు విచారణలో వెల్లడైంది. వీరి మీద గతంలోనూ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా భైంసా ASP శ్రీ అవినాష్ కుమార్, IPS మాట్లాడుతూ, “ఇలాంటి నిషేధిత మత్తుపదార్థాల వ్యాపారం చేసే ఎవరినైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం,” అని హెచ్చరించారు.

ఈ ఆపరేషన్‌లో ASP అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్ గోపినాథ్, సబ్ ఇన్స్పెక్టర్ నవనీత్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

భైంసా గాంధి గంజ్ వద్ద గంజాయి ముఠా అరెస్ట్ — ఇద్దరిని పట్టుకుని రిమాండ్‌కు పంపిన పోలీసులు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more