May 2, 2026 11:49 pm

V1News Telangana

రైళ్లలో భద్రతకు కొత్త ఒరవడి… ఇక ఒక్క చలనం కూడా కనిపించకుండా ఉండదు!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

74 వేల కోచ్‌లలో సీసీటీవీ అమరికకు రైల్వే శాఖ భారీ ప్రణాళిక

ట్రయల్స్ విజయవంతం… లోకోమోటివ్‌లలో ఏఐ ఆధారిత పర్యవేక్షణకు గ్రీన్ సిగ్నల్

వి1 న్యూస్, న్యూడిల్లీ:
రైళ్లలో ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేయడానికి రైల్వే శాఖ నూతన చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 74,000 రైలు కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

ఇప్పటికే నార్తర్న్ రైల్వే పరిధిలో లోకో ఇంజన్లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ట్రయల్స్ విజయవంతమయ్యాయని తెలిపారు. ఈ మేరకు శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి వైష్ణవ్‌తో పాటు సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ, రైల్వే బోర్డు అధికారులు పాల్గొన్నారు.

ప్రతి కోచ్‌కు నాలుగు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు ఆరు కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తలుపుల వద్ద ప్రత్యేకంగా కెమెరాలను అమర్చుతూ, ప్రయాణికుల ప్రవేశానికి సంబంధించిన ప్రతి చలనం నమోదు చేయనున్నట్లు వివరించారు.

కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా కెమెరా ఫుటేజీ విశ్లేషణ చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గంటకు 100 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్లే రైళ్లలో కూడా స్పష్టమైన దృశ్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more