ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాసం సందర్భంగా, బోధన్ పట్టణంలో జంగం గల్లీలోనీ పురాణే, పౌడయ్య మఠం ఆధ్వర్యంలో గురుధర్మభిక్ష కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఇది తరతరాల నుండి వారసత్వ పరంపరగా నిరంతరాయంగా కొనసాగుతున్న కార్యక్రమం, వీరశైవ లింగాయతుల ఆధ్యాత్మిక జీవన విధానంలో గౌరవప్రదమైన స్థానం కలిగి ఉంది. వీరశైవ సంప్రదాయంలో గురుపరంపరకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా, జంగములు నడయాడే శివునిగా భావించబడుతూ, గురువులుగా ఆదరించబడతారు. శిష్యులు వారి గురువులను పాదపూజ, దూపదీప నైవేద్య, మంగళహారతి వంటి సంప్రదాయాలతో సత్కరించి ధర్మభిక్షను సమర్పించడం ఒక పవిత్ర ఆచారంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, పురాణే, పౌడయ్య మఠానికి చెందిన గురువులను శిష్యులైన వీరశైవ లింగాయతల కుటుంబాలచే ఆహ్వానింపబడి, వారింటి వద్ద ఆధ్యాత్మిక ఆచారాలు నిర్వహించారు. శిష్యులు తమ ఇంటికి గురువులను ఆహ్వానించి పాదపూజ చేసి, ధర్మభిక్ష సమర్పించి, గురు ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమం ద్వారా శిష్యులు తమ కుటుంబానికి ఆయురారోగ్యాలు, శాంతి, సౌఖ్యాలు కలుగాలని ఆశిస్తూ, జంగముల ఆశీర్వచనాన్ని పొందడం జరుగుతుంది. పురాణే, పౌడయ్య మఠం నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “వీరశైవ ధర్మంలో జంగములు గురువులుగా ఉండి, శిష్యులకు ఇష్టలింగ దీక్షను ప్రసాదించటం ప్రారంభ స్థాయి ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత కాలంలో కూడా పునరుద్ధరించి, యువతకు పరిచయం చేయడం మా లక్ష్యంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ విధంగా గురుధర్మభిక్ష కార్యక్రమం, ఒక శిష్యుని జీవనంలో గురువుకలిగిన స్థానాన్ని గుర్తుచేస్తూ, పౌరాణిక ధర్మాన్ని ప్రతిపాదిస్తూ, ఆధ్యాత్మిక సంస్కృతిని తదితర తరాలకు సజీవంగా నిలవడం కొరకు ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వీరశైవ లింగాయత ప్రముఖులు మాట్లాడుతూ గురువులను గౌరవించడం తమ సాంప్రదాయమని, తమ పూర్వీకుల నుండి కొనసాగుతున్నదని, భవిష్యత్ తరాలకు మార్గ నిర్దేశంగా నిలుస్తుందని, ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. వీరశైవ లింగాయత ప్రముఖులు ఎంబెల్లి గంగారాం, కర్నే హనుమంతరావు, కర్నే శంకర్, కర్నె శ్రీను, వీరప్ప, శివలింగ, మాలింగ్ పటేల్, నవీన్, తదితర వీరశైవ శిష్యులు కార్యక్రమాన్ని ఆకట్టుకునేలా నిర్వహించారు. ఇందులో పురాణే పౌడయ్య మఠ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్, పౌడయ్య రాజేందర్ కుమార్, పురాణే దిలీప్ కుమార్, జంగమ సమాజం పట్టణ అధ్యక్షుడు నర్సింగ్ అప్ప, కార్యదర్శి శంకర్ అప్ప, జిల్లా డిడిఎన్ అధ్యక్షులు రాచప్ప, శివలింగ అప్ప తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






