ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు – ప్రభుత్వం కీలక అడుగు…
జూలై 27న లైసెన్స్డ్ సర్వేయర్ల తుది పరీక్ష – మంత్రి పొంగులేటి ప్రకటన..
. ల్యాబ్ ప్రాక్టికల్స్ 28, 29 తేదీల్లో – జేఏన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహణ…
ఆగస్టు 12న ఫలితాల ప్రకటన – రాష్ట్రవ్యాప్తంగా సర్వే సేవలకు పునాదులు.
ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీవో – రెవెన్యూశాఖలో నూతన సంస్కరణలు…
తెలంగాణలో 413 గ్రామాలకు నక్షాల్లేరు – ప్రభుత్వం రీసర్వే ప్రక్రియ ప్రారంభం..
యాదగిరిగుట్ట సహా ప్రధాన ప్రాంతాల్లో అదనపు సబ్‌రిజిస్ట్రార్లు నియామకం…
వి 1 న్యూస్.హైదరాబాద్, జూలై 12:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, భూసర్వే వ్యవస్థను సమర్థవంతంగా మార్చేందుకు కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రతి మండలానికి 4-6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఇందుకు అనుగుణంగా, ట్రైనింగ్ పొందిన అభ్యర్థులకు జూలై 27న తుది పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే, జేఎన్టీయూ (JNTU) ఆధ్వర్యంలో జూలై 28, 29 తేదీల్లో ల్యాబ్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ తర్వాత ఆగస్టు 12న ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లడించిన మరో కీలక అంశం ఏమిటంటే – రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ ప్రణాళిక అధికారి (జీపీవో) నియమించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో నక్షా లేని 413 గ్రామాల్లో ఇప్పటికే 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీ-సర్వే నిర్వహించామని తెలిపారు. త్వరలో మిగిలిన గ్రామాల్లో కూడా ఈ ప్రక్రియ విస్తరించనున్నారు.
అంతేగాక, ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగే యాదగిరిగుట్ట, పటాన్‌చెరు, మహబూబ్నగర్ వంటి ప్రాంతాల్లో అదనపు సబ్‌రిజిస్ట్రార్లను మరియు సిబ్బందిని నియమిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఈ చర్యలతో ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందని, భూసేవలలో సమర్థత పెరగనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








