June 17, 2026 4:53 am

V1News Telangana

శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ హనుమాన్ ఆలయంలో వైభవంగా తమలపాకుల పూజ…100 జంటలతో ప్రత్యేక పూజా కార్యక్రమం – భక్తులకు ఆహ్వానం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ శ్రీ మారుతి ఆలయంలో లక్ష తమలపాకులతో మహోత్సవ పూజ…
. శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ హనుమాన్ ఆలయంలో వైభవంగా తమలపాకుల పూజ…
. 100 జంటలతో ప్రత్యేక పూజా కార్యక్రమం – భక్తులకు ఆహ్వానం…
. శ్రీ హనుమంతుని కృపాకటాక్షానికి భాగ్యసూచకమైన మహోత్సవం..
ఆగస్టు 5న లక్ష తమలపాకుల పూజ – భక్తులు అధికంగా పాల్గొనాలన్న పిలుపు..

V1 న్యూస్ బోధన్, జూలై 12:బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన లక్ష తమలపాకులతో మహోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి ప్రత్యేకతగా నూట ఒక జంటలను నియమించి, ప్రతి జంటకు వెయ్యి తమలపాకుల విరివిగా పంపిణీ చేయనున్నారు.ఈ పవిత్ర కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు గారి నేతృత్వంలో, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్ రాములు గారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు గుండేడి శంకర్ గారు మరియు ఇతరులు సహకారాన్ని అందిస్తుండగా, ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలుజరుగనున్నాయి .అధ్యాత్మికంగా గొప్ప ప్రాధాన్యత కలిగిన ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపను పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. పూజా కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని ఆలయ అర్చకులు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more