June 17, 2026 3:47 am

V1News Telangana

ప్రపంచ జనాభా దినోత్సవం పై సన్నాక సమావేశం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలపై వివిధ పీహెచ్ సిల వైద్యాధికారులతొ జిల్లాస్థాయి సన్నాక సమావేశాన్ని నిర్వహించినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని, ఆరోగ్య ఉపకేంద్ర పరిధిలో అర్హులైన దంపతుల రిజిస్టర్లను సవరించాలని, అర్హులైన దంపతులందరూ శాశ్వత మరియు తాత్కాలిక కుటుంబ పద్ధతులను అవలంబించేలా చూడాలని, ఈ సందర్భంగా జిల్లాలో పురుషుల కొరకు కుటుంబ నియంత్రణ చికిత్స అయిన ఎన్ ఎస్ వి /వాసక్టమి నీ ఆర్మూర్, డిచ్పల్లి, మోర్తాడ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన పి పి ఐ యు సి డి, ఐయూసీడీ, అంతరా ఇంజక్షన్, ఓరల్ పిల్స్, పురుషుల కొరకు నిరోద్ లాంటివి వాడి జనాభాను నియంత్రించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిఓఎంసిహెచ్ డాక్టర్ సుప్రియ, పి ఓ ఎన్ సి డి డాక్టర్ సామ్రాట్ యాదవ్, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు మరియు వివిధ పిహెచ్సి ల వైద్యాధికారులు హాజరైనారు.

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

Leave a Comment

Read more
Read more