June 17, 2026 3:32 am

V1News Telangana

బోలశంకరుడి మానవత్వం – రక్తదానం చేసి ప్రాణం నిలిపిన సాయి కుమార్… . భైంసా బాబ్లూ: అవసరంలో పరుగెత్తిన రక్తసైనికుడు… మనిషిగా మిగిలాడు – సాయికుమార్ సేవా స్ఫూర్తి…. ఆపదలో ఆరాటంగా – సాయికుమార్ మానవతా ముద్ర… పిలుపునిస్తే ప్రాణదానం – రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన బాబ్లూ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

భైంసా వాసి బాబ్లూ మానవత్వానికి మరో ఉదాహరణ…

భైంసా:
రక్తదానం చేయడం మనిషితనానికి ప్రతీక. ఆ మానవతా గుణాన్ని చూపిస్తూ, భైంసాకు చెందిన సాయి కుమార్ అలియాస్ బాబ్లూ నేడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అపెక్స్ హాస్పిటల్‌లో వనిత అనే మహిళకు అత్యవసరంగా B+ గ్రూప్ రక్తం అవసరమైంది. ఈ విషయం తెలిసిన క్షణంలోనే వెంటనే హాస్పిటల్‌కు చేరి రక్తదానం చేసి మానవతా ధర్మాన్ని నిలబెట్టాడు.

సాయి కుమార్ తన చిన్నపిల్లల వంటి మనసుతో, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే కన్నీళ్లు కారుస్తూ వారికి ఎలా సహాయం చేయాలో ప్రయత్నించే వ్యక్తి. అవసరమైతే తన వంతు చేయకపోయినా, పది మందిని పురమాయించి సహాయం అందేలా చూస్తాడు.
సామాజికంగా బాధ్యతతో వ్యవహరిస్తున్న బాబ్లూకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more