బోధన్ రూరల్, నిజామాబాద్ | 16.05.2025 (అర్థరాత్రి)
అత్యంత తీవ్రమైన చట్టవిరుద్ధ మాదకద్రవ్య రవాణా కార్యకలాపానికి బోధన్ రూరల్ పోలీసుల దాడిలో తెరలేపబడింది. ఒంటిమిట్ట హనుమాన్ టెంపుల్, సాలూరా గ్రామం సమీపంలో జరిగిన ఆకస్మిక దాడిలో రూ. 25 లక్షల విలువైన 2.5 కిలోల అల్ప్రజోలం, MH 14HD 7889 నంబర్ స్కోడా కారు, 8 మొబైల్ ఫోన్లు, రూ. 2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన నిందితులు:
A1 అమర్ సింగ్ దేశముఖ్ (38), సతారా, మహారాష్ట్ర

A2 బాబు రావు కడేరి అలియాస్ ప్రసాద్ (43), పూణే
A3 షబ్బీర్ అలీ పాషామియా చౌదరి (30), ఉస్మానాబాద్
A4 పరమేశ్వర్ బర్దాడే (30), పూణే
A5 మల్లెపూల లక్ష్మణ్ గౌడ్ (43), సాలూర, నిజామాబాద్
కేసు నేపథ్యం:
2019 నుంచి అమర్ సింగ్ దేశముఖ్ మహారాష్ట్రలో కెమికల్ కంపెనీ నడుపుతూ, A-6 విశ్వనాథ్ శిపంకర్ తో కలసి అల్ప్రజోలం తయారీకి పాల్పడ్డాడు. A1 నుండి A4 వరకూ మందు సరఫరా చేసి, A5 ద్వారా నిబంధనలకు విరుద్ధంగా విక్రయించేవారు.
15.05.2025 న రాత్రి 11:00 గంటల సమయంలో వారంతా సాలూర వద్ద కలసి మాదకద్రవ్యాల బదిలీకి సిద్ధమయ్యారు. బోధన్ రూరల్ పోలీసులు & TG ANB బృందం సంయుక్తంగా రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేసి, ఆధారాలతో సహా పంచనామా నిర్వహించారు.
ప్రజలకు హెచ్చరిక:
నిషేధిత మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, అమ్మకం నేరం. NDPS చట్టం సెక్షన్ 31A ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష నుండి మరణ శిక్ష వరకు విధించబడే అవకాశం ఉంది.
ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొనవద్దని, దయచేసి మీ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద చటువటికలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని బోధన్ రూరల్ పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








