June 17, 2026 3:11 am

V1News Telangana

బీర్కూర్‌లో పేకాట మాఫియా రాజ్యం – ప్రజలు మండిపడుతున్నారు! చట్టం చేతబడి… మంజీరా అరణ్యంలో పేకాట రాజధాని! పేకాటకు ప్రజాప్రతినిధుల ప్రమేయం? – బీర్కూర్‌లో నేరపూరిత అల్లకల్లోలం! . పోలీసుల కడుపులకే మామూలు? – ప్రజలకు మాత్రం అప్పుల ఊబి! . పేకాట ముఠాలకు అధికారుల ప్రమేయం – ఎవరు నిలుపుతారు ఈ వికృత నాటకం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బీర్కూర్‌, కామారెడ్డి జిల్లా: మంజీరా అరణ్యం… ఒకప్పుడు ప్రకృతి ప్రేమికుల కళ్లలో కొలువై ఉండేది. కానీ ఇప్పుడు? పేకాట ముఠాల క్రీడాభూమిగా మారింది. బీర్కూర్ మండలంలోని అడవుల్లో, చెట్ల మధ్య గూడుల్లాంటి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం క్రమంగా పేలుతోంది.

చట్టాన్ని తమ చేతిలో పెట్టుకుని, ప్రజాప్రతినిధుల ప్రమేయం తో నడుస్తున్న ఈ ముఠాలు, స్థానికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. పేకాటకి బానిసలై అనేక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. కొందరు తమ ఆస్తులు మాత్రమే కాదు, తమ ఆశలు కూడా కోల్పోతున్నారు.

ప్రభుత్వ అధికారుల తీరుపై నిరాశ:
గత కొన్ని రోజులుగా కేసులు నామమాత్రంగా నమోదు చేసి, పేకాట నిర్వాహకులకు తప్పించుకునే మార్గాలు చూపుతున్న అధికారులు, ప్రజల కోపానికి గురవుతున్నారు. “ఇది పోలీసుల మౌనసమ్మతి లేకుండా ఎలా సాధ్యమవుతుంది?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

పెరుగుతున్న విస్తరణ:
జగిత్యాల్, ఆర్మూర్, నిజామాబాద్, నసురుల్లాబాద్, బాన్సువాడ, వార్ని, బోధన్ వంటి ప్రాంతాల నుండి ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో బీర్కూర్‌కు చేరుకుంటున్నారు. విందు, మందు, రహస్య గూడులు – పేకాట ముఠాలు అంతా రెడీగా ఉంచి ఆటగాళ్లను మభ్యపెడుతున్నాయి. లక్షల రూపాయల మోసాలు, తాకట్టు వేసిన వాహనాలు, నగలు… జీవితాలను నాశనం చేస్తున్న పేకాట మాఫియా!

ప్రజల డిమాండ్ – తక్షణ చర్యలు:
“ఇక అయినా అధికారులు మేలుకుంటారా?”, “పేకాట ముఠాలకు ఎప్పుడు అంతం అవుతుంది?” అంటూ ప్రజలు. మరియు కొందరు బాధ్యత కుటుంబాలు గళం విప్పుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేరుకే కేసులు వేసి వదిలేయకుండా చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని కొందరు బాధ్యత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు….

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more